విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు

సంగీతరావు గారి బాల్యం గురించీ, సంగీతజ్ఞానం గురించీ ఈమాటలో రోహిణీప్రసాద్ గారు మూడు వ్యాసాలు రాశారు.

సార్థక నామధేయుడు సంగీతరావు
సంగీతరావు గారి చిన్ననాటి సంగతులు
88 యేళ్ళ యువకులు

ఆయన గురించిన మరెన్నో అపురూప విశేషాలను పట్రాయని సుధారాణిగారు తమ బ్లాగులో చాలా వివరంగా చెప్పారు. అందువల్ల మరల ఆయనను కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఆయన చిన్నతనంలో, అంటే 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.