బ్రౌన్ పురస్కారం – 2015

అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వై. ముకుంద రామారావు గారికి ప్రకటిస్తున్నాము.

క్లుప్తంగా: ఖరగపూర్ లో జననం (1946), తెలుగులో ప్రాథమిక విద్యాభ్యాసం, సాగర్ యూనివర్సిటి, ఖరగపూర్ ఐఐటిలలో గణితంలో ఉన్నత విద్య. బహుకాలం రైల్వేలో ఉద్యోగం, HP కంపెనీలో మేనేజర్గా పదవీ విరమణ.

ముకుంద రామారావు గారు ‘వలస పోయిన మందహాసం’ మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి. కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా వీరు బృహత్తర ప్రణాళికతో దేశ దేశాల కవిత్వాన్ని తమదైన శైలిలో అనువాదం చేసి – అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి – అన్న పుస్తకాలుగా వెలయించారు. టాగోర్ అంతిమ కాలంలో రచించిన ‘నమ్హార రేఖా పథ్ బెయె’ అన్న చిత్ర కవిత్వాన్ని తెనిగించారు. అంతేగాక, మరో ఐదు భారత కవుల అనువాద పుస్తకాలు రానున్నాయి.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...