సంభాషణ

నువ్వు నా మాటల్ని వింటున్నావనుకుంటాను.
ఆనందంగా, అనర్గళంగా
మాట్లాడుతూనే ఉంటాను.
కాని, నీ చెవుల్లో
కనబడకుండా దాగిన రెండు నల్ల మొగ్గలు.

నువ్వు నాతో మాట్లాడుతున్నవనే అనుకుంటాను.
ఆశ్చర్యంతో,
అంతుపట్టని ఆ మాటల్ని
అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను.
చూస్తే, నీ చెవి మీద
మిలమిలలాడుతూ వాలిన ఒక నీలి తుమ్మెద!