ఈమాట జనవరి 2015 సంచికకు స్వాగతం!

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!


ఆలన్ ట్యూరింగ్(23 జూన్ 1912 – 7 జూన్ 1954.)

కంప్యూటర్లు మన జీవితాలని ఊహించని విధంగా మార్చేశాయి. మన ఆలోచనలని, అనుభవాలని, మన విద్యవైద్యావైజ్ఞానిక విధానాలకు, పరిశోధనలకు మునుపెన్నడూ లేనంత ఊతం ఇచ్చాయి, మన ప్రస్తుత కాలాన్ని సాంకేతిక యుగం అని పిలుచుకునేంతగా కంప్యూటర్లు మానవాళిని ప్రభావితం చేశాయి. ఐతే, వీటి ఆవిర్భావానికి ట్యూరింగ్ మెషీన్ అని పిలవబడే ఒక ఆలోచన, ఒక యంత్రం కాని యంత్రం ఆధారం అని, అది ఎంత తేలికైన, అద్భుతమైన ఆలోచనో తెలుసుకున్నవారు విస్మయానికి గురి కాకతప్పదు. అందుకు ఆద్యుడైన ఆలన్ ట్యూరింగ్ గురించి కంప్యూటర్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు అనే శీర్షిక క్రింద కొడవళ్ళ హనుమంతరావు కొంత విరామం తరువాత రాసిన వైజ్ఞానిక వ్యాసం; వాణి నా రాణి అని ఠీవిగా చాటుకున్న పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని రాసిన ఉదంతాన్ని చక్కటి కథగా మలచిన తిరుమల కృష్ణదేశికాచార్యుని పద్యనాటిక, ఈ సంచికలో.


  • కవితలు: The great Indian rope trick – పాలపర్తి ఇంద్రాణి; నిర్ణయం – మానస చామర్తి; ఆర్తి – స్వాతికుమారి బండ్లమూడి; విమాన-మనం – గరిమెళ్ళ నారాయణ.
  • కథలు: ఎం. వీ. విందుడు – బులుసు సుబ్రహ్మణ్యం; ప్రక్షాళన – ఆర్. శర్మ దంతుర్తి; అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం – శ్యామలాదేవి దశిక; స్టార్‌బక్స్ కథలు: కాఫీ బానిస – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • వ్యాసాలు: కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం – కొడవళ్ళ హనుమంతరావు; గీతులు – జెజ్జాల కృష్ణ మోహన రావు; జాషువా – పిరదౌసి: సమీక్ష – మానస చామర్తి.
  • ఇతరములు: నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక – భైరవభట్ల కామేశ్వరరావు; చివరకు మిగిలేది: రేడియో నాటిక; రచన: బుచ్చిబాబు, నాటకీకరణ: పాలగుమ్మి పద్మరాజు; వింజమూరి శివరామారావు లలిత గీతాలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.