అక్కర లేని సంగతుల

రాగం: ధర్మవతి
తాళం: ఆది

స్వర రచన, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

పల్లవి:
అక్కర లేని సంగతుల
చక్కెర పాగున ఈగ వలె
అక్కడ వాలి ఇక్కడ వాలి
చక్కరులాటలు మానవుగా?!
చరణం:
అగ్గలమై నీ అతిశయము
పగ్గెలపోయేటిది అహము
తగ్గూ మొగ్గుల తాలికలోఁబడి
తనలో తానని తలచవుగా?!          |అక్కర|
చరణం:
పొద్దుట లేచిన మొదలుకొని
నిద్దుర వరకూ నెగులుకొని
అద్దువ చూపుకు ఒద్దిక చూపే
అణకువనైతే కానవుగా?!           |అక్కర|
చరణం:
అప్పలఁకప్ప అరుణ గిరిఁ
యొప్పిన వెలుగు రమణ ముని
చెప్పినయందే చెలువైయుంటే
తప్పులు నొప్పులు తోపవుగా!         |అక్కర|

For Rev. Fr. జలుమూరు ఆనందరావు.