ఈమాట మే 2014 సంచికకు స్వాగతం!

బ్రౌన్ దొర! తెలుగుభాషోద్ధారకుడు! తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడు! కేవలం ఇలానే మనకు తెలిసిన సి.పి. బ్రౌన్‌ (ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్, 1798-1884) గురించి ఇప్పటికీ మనం వర్ణించుకుంటున్నాం. గడిచిన ఇన్నేళ్ళలో కవిపండితులు, మేధావులు మొదలుకొని విశ్వవిద్యాలయాల ఆచార్యుల దాకా ఇలా బ్రౌన్ గురించి వందిమాగధుల స్తోత్రాలు చదివిన వారే, భక్తిపారవశ్యంతో పోటీలు పడి మరీ అతన్ని కీర్తించిన వారే కానీ, చారిత్రక దృష్టితో తెలుగు భాషలో బ్రౌన్ చేసిన పనులేమిటి, బ్రౌన్ ఉద్దేశాలేమిటి, తెలుగు భాషకు అతని సంస్కరణలవల్ల జరిగిన మేలేమిటి, కీడేమిటని అని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించి పరిశోధించినవారు లేకపోవటం ఆశ్చర్యాన్నీ, మన దాస్యప్రవృత్తిపట్ల బాధనూ కలిగించే విషయం. ఈ రోజు ఆ ప్రశ్నలకు మొట్టమొదటిసారిగా ఒక సమాధానం దొరుకుతున్నది. గత కొన్నేళ్ళుగా విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన సాహిత్య, చారిత్రక ఆధారాలను పరిశీలించి, బ్రౌన్ తెలుగు భాషలో చేసిన పని గురించి క్షుణ్ణంగా పరిశోధించి ఒక సమగ్రవ్యాసంగా మనకు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావులు మనకు తెలియని బ్రౌన్‌దొర పేరుతో ఈ సంచికలో అందిస్తున్నారు. తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరూ చదవవలసిన ముఖ్యమైన వ్యాసం ఇది.

[04 May 2014: The image has been changed to the ‘Telugu to English’ dictionary. The previous cover photo is of ‘English to Telugu’ dictionary, which is not the eponymous Brown dictionary version. Error regretted. – Ed.]


ఈసంచికలో:

  • కథలు: ఏనాడూ విడిపోని ముడి వేసెనే – పూర్ణిమ తమ్మిరెడ్డి; సెలవురోజు మొదటి ఆట – చంద్ర కన్నెగంటి; విముక్తం – రాధ మండువ; ఎండని ఏడో చేప కథ – వేమూరి వేంకటేశ్వరరావు; ఇద్దరు మిత్రులు – ఆర్. శర్మ దంతుర్తి; కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ – సాయి బ్రహ్మానందం గొర్తి.
  • కవితలు: మరి నువ్వేమో… – నిషిగంధ; మోహమకరందం – మానస చామర్తి; ఇది మరీ బాగుంది – తఃతః; ఆకాంక్ష – సమవర్తి; అతిథి – ఉదయకళ; భాగవతావతరణము – తిరుమల కృష్ణదేశికాచారులు.
  • వ్యాసాలు: మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ – పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు; వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు – వేమూరి వేంకటేశ్వరరావు; త్రికాల సంపుటి త్రిపుర – సీతారాం; గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని – ఏల్చూరి మురళీధరరావు; కంద పద్యగాథ-2 – జెజ్జాల కృష్ణమోహనరావు.
  • సమీక్షలు: అంపశయ్య: మరొకసారి కొత్తగా! – సుజాత; ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం – మానస చామర్తి.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవ్వరు – భైరవభట్ల కామేశ్వరరావు; పలుకుబడి: దిక్కులు, పక్కలు – సురేశ్ కొలిచాల.
  • శబ్దతరంగాలు: పెండ్యాల నాగేశ్వరరావు ప్రత్యేక జనరంజని – పరుచూరి శ్రీనివాస్.
  • ఇంకా: కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి – రాజా పిడూరి; గ్రంథాలయంలో పెద్దక్క ప్రయాణం పుస్తకం.