శ్రీమాన్ పుట్టపర్తి: నా జ్ఞాపకాలు

మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో…

ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. నారాయణాచార్యులుగారి కుమార్తెలు అనూరాధ, నాగపద్మిని గార్ల బ్లాగు/యూట్యూబు పేజీలలో ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి. వారి పేజీల్లోనే ఆయన కడప ఆకాశవాణి కేంద్రంలో జరిపిన ‘సంభాషణలు‘ 1, 2, 4 భాగాలు వినవచ్చు. (మూడో భాగం నాకు కనపడలేదు.) ఈ సంభాషణలు ‘సరస్వతీ పుత్రునితో సంభాషణలు’ అన్న పేరుతో 2002లో పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. కానీ మీకు ఇక్కడ వినిపించబోయే ‘జ్ఞాపకాలు’ వారి శతజయంతి సందర్భంలో నా నివాళి.