శ్రీమాన్ పుట్టపర్తి : శివతాండవ కవితాగానం

మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో…

ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. నారాయణాచార్యులుగారి కుమార్తెలు అనూరాధ, నాగపద్మిని గార్ల బ్లాగు/యూట్యూబు పేజీలలో ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి.

ఆయన ప్రఖ్యాత రచన ‘శివతాండవా’న్ని ఆయనే గానం చేశారు. అది రికార్డయిన తొలిరోజుల్లో (1960 ప్రాంతం?) కడప కేంద్రం నుండి, తరువాత హైదరాబాదు కేంద్రం నుండి కొన్ని సార్లు ప్రసారమయ్యింది.ఈ రికార్డింగుకి తరువాతి కాలంలో కొన్ని పక్క వాద్యాలు జతపరచబడ్డాయి. ఈ రచనని చాలా మంది చాలా రీతుల్లో ప్రదర్శించ ప్రయత్నించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది 1993లో నాగపద్మినిగారు ‘శివతాండవాన్ని’ రేడియో ప్రసారణ కోసం చేసిన అనుసరణ. ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ యెల్లా వెంకటేశ్వరరావు సంగీత నిర్వహణలో ఇది ప్రసారం అయ్యింది. ఆ రూపకాన్ని మాగంటి.ఆర్గ్‌లో వినవచ్చు.

మరొకటి ఇప్పుడు ఇక్కడ వినండి: