అల బేల మరుల స్వామి

అల బేల మరుల స్వామి

రాగం: అహిర్ భైరవ్ (చక్రవాకం)

సంగీతం, గానం: నచికేత్ యక్కుండి
రచన: కనక ప్రసాద్

సాహిత్యం

అల బేల మరుల స్వామి రా
లలి కన్నులఁ యన్నులు పాఱాడ రా
అల బేల మరుల స్వామి రా

మంగళ గానా… స్వాద విలో… లా
మనో రంజన భావ సుధాకరా       |అల బేల|

నిరు నీలీ కనుల కాహళి
చెలి నిల్వు ఎల కాంక్షా దేహళి
నిరు నీలీ కనుల కాహళి

మోహన రాగా…
ర్ణవ నవజా.. త
రజిత జగత్ రజ రజనీ.. కరా…        |అల బేల|


for ప్రసాద్ చోడవరపు, for రంగవల్లి


Inspiration: హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుంచి ‘అలబేలా సజన్ ఆయో రీ’ అనే గీతం. ఈ గీతాన్ని సృజించినది మొగల్ చక్రవర్తి రోషన్ అఖ్తర్ (మొహమ్మద్ షా) ఆస్థానంలో భూపత్‌ఖాన్ అనే విద్వాంసుడని, ఆయన కలం పేరు ‘మనరంగ్’ అనీ చరిత్ర. ఆయన సదారంగ్ అని పిలవబడే నియామత్‌ఖాన్ కుమారుడు, గ్వాలియర్ సంప్రదాయానికి చెందినవాడు.

హిందుస్థానీ మూలం – (పండిట్ బసవరాజ్ రాజ్‌గురు గాత్రం, ఉస్తాద్ రాషిద్ ఖాన్ గాత్రం.)

అల్‌బేలా సాజన్ ఆయోరి
మొర అతిమన్ సుఖ్ పాయొరి

మంగల్ గావో చౌక్ పురావో
మనరంగ్ నిస్ దిన్ పాయొరి

మంగల్ గావో చౌక్ పురావో
సకల జగత్ ఆనంద్ పాయొరి

(నచికేత యక్కుండి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నివసించే హిందుస్థానీ గాయకుడు. నచికేత పుట్టి, పెరిగింది కర్ణాటక లోని ధార్వాడ్‌లో. ఆయన భారతదేశం, అమెరికాల్లో అనేక నగరాల్లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కచేరీల్లో పాడేరు. ప్రస్తుతం కుపర్టినోలో తన గురువుగారైన పద్మవిభూషన్ పండిత బసవరాజ్ రాజ్‌గురు పేరిట రాజ్‌గురు సంగీత విద్యానికేతన్‌ను నిర్వహిస్తున్నారు.)