ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం!


ఆచార్య ఎస్. మీనాక్షిసుందరం
(12 అక్టోబర్ 1913 – 13 ఆగస్ట్ 1968)

గణితశాస్త్ర ప్రపంచంలో పేరెన్నిక గన్న ప్రతిభావంతులలో ఒకరైన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం శతజయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూ, గణితంలో ఆయన విశేషకృషిని వివరిస్తూ వాసుదేవరావు ఎరికలపూడి రాసిన శాస్త్రీయ వ్యాసం, ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం; నన్నెచోడుని కుమారసంభవంలో లలితాస్యాంబురుహంబు పద్యం గురించి మానవల్లి రామకృష్ణకవి విమర్శను ప్రస్తావిస్తూ ఆ వివాదం ఆ కావ్యపు కర్తృ – కాల నిర్ణయాలకు ఎలా మూలచ్ఛేదనం అయిందో వివరిస్తూ ఏల్చూరి మురళీధరరావు సాహిత్య వ్యాసం, నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన; నాగరాజు పప్పు, పరుచూరి శ్రీనివాస్ పరిశోధనాత్మక చారిత్రక వ్యాసం రెండవ భాగం, భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు ఈ సంచికలో ప్రత్యేకం.


ఈ సంచికలో:

  • కవితలు: అల్లరి పిచుకలు – పాలపర్తి ఇంద్రాణి; రచనా వివేచన – ఎలనాగ; ఒంటరి ప్రపంచం – క్రాంతికుమార్ మలినేని; ఒక్కో రోజు – మానస చామర్తి; చినుకొకపరి – దాసరాజు రామారావు, ఆకు రాలు కాలము -జెజ్జాల కృష్ణ మోహన రావు.
  • కథలు: కవితాకన్యక మాన సంరక్షణము – మాగంటి వంశీ మోహన్, తెలిసీ పలికిన విలువేమో – తాడికొండ శివకుమార శర్మ, ప్రద్యుమ్నుడి ఉపవాసం – బులుసు సుబ్రహ్మణ్యం, ద్వితీయ కళత్రం – ఆర్. శర్మ దంతుర్తి, ప్రొగ్రెషన్ – లైలా యెర్నేని.
  • వ్యాసాలు: ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం – వాసుదేవరావు ఎరికలపూడి; భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ భాషలు – నాగరాజు పప్పు, పరుచూరి శ్రీనివాస్; నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన – ఏల్చూరి మురళీధరరావు; గద్యములో పద్యములు – జెజ్జాల కృష్ణ మోహన రావు; తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత – రాళ్ళపల్లి సుందరం; శషసలతో శషభిషలు – సురేశ్ కొలిచాల.
  • పద్యసాహిత్యం: నాకు నచ్చిన పద్యం: చిత్తము పల్లవింప జేసే తిక్కన కవిత్వం – భైరవభట్ల కామేశ్వరరావు; విశ్వనాథ: వివాహాశీస్సులు – ఏల్చూరి మురళీధరరావు.
  • శబ్దతరంగాలు: మేఘసందేశం – సంగీత రూపకం; చా.సో.తో ముఖాముఖీ; అల బేల మరుల స్వామి – కనక ప్రసాద్.