ప్రతిమా నాటకం: ఒక సన్నివేశం

ప్రతిమ – సంస్కృత నాటకం నుండి ఒక సన్నివేశం

విజయవాడ ఆకాశవాణి కేంద్రం తొలి నాళ్లలో ఎందరో ప్రముఖ సాహిత్యకారులు అక్కడ పనిచేశారు. వారిలో పింగళి లక్ష్మీకాంతం, జి. వి. కృష్ణారావు, బాలాంత్రపు రజనీకాంతరావు గార్లు కేవలం తెలుగు సాహిత్యానికే పరిమితం కాకుండా సంస్కృత (నాటక) సాహిత్యాన్ని కూడా తెలుగు శ్రోతలకు పరిచయం చేసే ప్రయత్నాలు చేశారు. ఇదే కాలంలో రజని గారు సంస్కృత చతుర్భాణీని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆయనే లక్ష్మీకాంతం గారితో కలిసి కొన్ని సంస్కృత నాటకాలను, ఉదా: దూతవాక్యమ్, పాంచరాత్రమ్, దూత ఘటోత్కచమ్, ప్రతిమ, వేణీసమ్హారమ్, అనర్ఘరాఘవమ్ తెనిగించారు. తరువాతి కాలంలో నల్లాన్‌చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు ఇలాంటి ప్రయోగాలని కొంతవరకు కొనసాగించారు, ఉదా: మాళవికాగ్నిమిత్రమ్ (1977 లో ప్రసారం).

ఈ సంచికలో మీకు వినిపించబోయేది భాసుడి రచనగా పేరుపొందిన ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం. ఇది మొదటిగా 28.03.1965 న ప్రసారితమయ్యింది. తెలుగువాళ్లు తమ సంస్కృత ఉచ్చారణ గురించి కించిత్ గర్వంగా చెప్పుకోవడం కద్దు. అది ఎంతవరకు నిజమో మీరే విని చూడండి.

ప్రసారమైన తేది: 28.03.1965

సమర్పణ: డా. జి.వి. కృష్ణారావు
దశరథుడు – అద్దంకి శ్రీరామమూర్తి
రాముడు – సి. రామమోహనరావు
లక్ష్మణుడు – తాడేపల్లి యుగంధరరావు
సుమంత్రుడు – కె.వి.ఎస్. కుటుంబరావు
కౌసల్య – ఎం. నాగరత్నమ్మ
సీత – ఇందిరా ప్రియదర్శిని
అవధూతిక – ఎం. రాజ్యలక్ష్మీదేవి
చేటి – వి. కనకదుర్గ

ప్రతిమ సంస్కృత నాటక పూర్తి పాఠం- దేవనాగరిలో (పరిష్కర్త: టి. గణపతి శాస్త్రి); తెలుగులో సేత: (వేటూరి ప్రభాకర శాస్త్రి.)