ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం!


మానవాకృతితో కొత్తప్రయోగం – ఎస్.వి. రామారావు

పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు – ఆంధ్రభాషలో చారిత్రక నవల గురించి నోరి నరసింహశాస్త్రి పరిచయ వ్యాసం, కొల్లాయి గట్టితేనేమి నవలపై రారా సమీక్షావ్యాసం, ఇర్వింగ్ స్టోన్ వ్రాసిన జీవిత నవల వ్యాసానువాదం ఈ సంచికలో మీకోసం.


ఈ సంచికలో:

కవితలు: వేసవి – పాలపర్తి ఇంద్రాణి; అటు నేనే ఇటు నేనే -తః తః; స్మృతి – వైదేహి శశిధర్; ఆఖరి మనిషి – విన్నకోట రవిశంకర్, జుగల్‌బందీ – కనకప్రసాద్‌.

వ్యాసాలు: యజ్ఞం కథ-మరో పరిశీలన – సి. ఎస్. రావ్; మత్తకోకిల కథ – జెజ్జాల కృష్ణ మోహన రావు; తెలుగులో వ్యాకరణాల పరిచయం – సురేశ్‌ కొలిచాల, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు – వేలూరి వేంకటేశ్వర రావు, జీవిత నవల – పప్పు నాగరాజు; కొల్లాయి గట్టితేనేమి?(ఉత్తమ చారిత్రక నవల) – రా.రా; ఆంధ్రభాషలో చారిత్రత్మక నవలలు – నోరి నరసింహశాస్త్రి; అమ్మ గోపెమ్మ – కాశీనాధుని రాధ (సాంప్రదాయ సాహిత్య వ్యాసం); రెండు కవితలు ఇద్దరు కవులు – కె. వి. గిరిధరరావు ప్రశంసా వ్యాసం.

కథలు: బింబం – గౌరి కృపానందన్, కాల్వీనో కథల నుంచి 4 – మాధవ్‌ మాచవరం, అంతరం – కొల్లూరి సోమ శంకర్, ఉరుము ఉరిమి… – ఆర్. దమయంతి.

శీర్షికలు: నాకు నచ్చిన పద్యం-ద్రౌపది పరివేదన – చీమలమర్రి బృందావనరావు, మూడు లాంతర్లు 11 – కనకప్రసాద్‌; హోమగుండం: కథ నచ్చిన కారణం – వేలూరి వేంకటేశ్వర రావు.

మీ సద్విమర్శలకై వేచి చూస్తుంటాం.

– ఈమాట సంపాదకులు.