వేసవి

రైయ్యిమని వడగాలి పరుగుకు
జిల్ జిల్ గోళీ సోడా ఈల
చురుక్కు కొమ్ములు విసిరే ఎండకు
సింహం తల కూజా పంజా
సెగల రెక్కలు సాచిన ఇనునికి
పకపక నవ్వుల పంకా జోరు
నిప్పుల పువ్వులు విచ్చిన వేసవి
రస్నా పాపకు దాహం దాహం
భగభగ మండుటెండను పట్టే
పుచ్చకాయలో ఎర్రని కిటికీ
ఉక్కలు పెట్టే బొబ్బలు పుట్టే
చెమటకాయలతో చికాకు పెట్టే
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఎండకు ఎండకు ఎండకు
నా పొట్ట నిండుగా మామిడి రసము.