శివోహం! శివోహం!

సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ రికార్డింగు చేయబడింది (నాకు తెలిసినంతలో). ఇప్పుడు ప్రసారమవుతున్నదో లేదో తెలియదు కానీ, 1975-1985 మధ్యకాలంలో ఆకాశవాణివారి “భక్తిరంజని” కార్యక్రమం ద్వారా బాగా పేరు గడించిన ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.

నాకు తరచుగా ఫలానా పాట కావాలని e-mails వస్తుంటాయి. కానీ, సూర్యకుమారిగారు పాడిన ఈ ఆది శంకరుని రచనగా భావించబడే ‘నిర్వాణ షట్కం’ (లేక నిర్వాణ శతకం) కావాలని అడిగినంత తరచుగా మరే పాటకోసం అడగలేదు. డా. నాగభైరు అప్పారావుగారు 1985లో చేసిన రికార్డింగు యూట్యూబులో చూడవచ్చు. జ్ఞాపకాల బరువులవల్లేమో వీడియో లభ్యమవుతున్నా, ఆకాశవాణి రికార్డింగు కోసమే అడుగుతుంటారు. మీరూ విని ఆనందిస్తారనే అనుకుంటున్నాను.

– పరుచూరి శ్రీనివాస్