కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు

నవంబర్ 1952 కినిమా సంచికలో, అప్పటి సినీరంగంలో పైకొస్తున్న హాస్యనటులు రేలంగి, జోగారావు, బాలకృష్ణ, పద్మనాభం తమ తొలి అనుభవాలను వివరించారు. వీరిలో ముందుగా చనిపోయినది జోగారావు. ఎక్కువకాలం బతికినది పద్మనాభం. వీరితో బాటుగా దేవదాసు సినిమా తీస్తున్న నిర్మాత డి.ఎల్. అనుభవాలు కూడా ఉన్నాయి. వీరి మాటల్లో అప్పటి పరిస్థితులు తెలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరం అనిపిస్తుంది.

– కొడవటిగంటి రోహిణీప్రసాద్


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...