తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ – రచనలకు ఆహ్వానం

తానా జ్ఞాపిక ‘తెలుగు పలుకు’ – రచనలకు ఆహ్వానం

శాంటా క్లారా, కేలిఫోర్నియాలో (జులై 1-3, 2011) జరుగబోతున్న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) 18 వ సభల సందర్భంగా వెలువడనున్న ‘తెలుగు పలుకు’ జ్ఞాపిక(Souvenir) ప్రచురణ నిమిత్తమై రచనలు ఆహ్వానిస్తున్నాం. సభల ఇతివృత్తం ‘తెలుగు యువత ప్రగతి ప్రతీక’ (Conference theme is ‘Telugu youth Symbol of progress’).

సభల ఇతివృత్తాన్ని ప్రతిబింబించే రచనలు పంపితే మంచిది. జ్ఞాపికలో ఆంగ్ల రచనలకు కూడా సముచిత స్థానం ఉంటుంది.

తెలుగు కథలు, కవితలు, పద్యాలు, వ్యాసాలను PDF, RTS ఫైలు రూపాలలోను, ఆంగ్ల రచనలను Microsoft Word రూపంలోనూ పంపితే మాకు సౌకర్యంగా ఉంటుంది. మా ఈమైల్ ఐడి souvenir@tana2011.com

వ్రాత ప్రతులను పంపేవారు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.

Giridhararao Karyamapudi
5114 Damiano Ct.
Pleasanton, CA 94588.

రచనలు మాకు అందడానికి ఆఖరు తేది ఏప్రిల్ 15, 2011.

ప్రచురణకు స్వీకరించిన రచనల గురించి రచయితలకు తెలియ చేస్తాం. సంపాదక బృందానికి ప్రచురణకు స్వీకరించిన రచనలలో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసే హక్కు ఉంటుంది. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

తానా సభ వివరాలకు, మరిన్ని ‘జ్ఞాపిక’ వివరాలకు www.tana2011.com ను దర్శించగలరు.

– తానా 2011 జ్ఞాపిక సంపాదక బృందం