ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు

1970, 80 దశకాల్లో ఎన్నో మరపురాని బాణిలు కట్టి సినిమా సంగీతాభిమానుల్ని అలరించిన సంగీత దర్శకుడు పసుపులేటి రమేశ్ నాయుడు (1933 – 1987). ఆకాశవాణి విజయవాడ కేంద్రం – వివిధభారతి సమర్పించిన ఆయన ప్రత్యేక జనరంజని కార్యక్రమం (ఏప్రిల్? 1981) ఆడియో ఈమాట పాఠకుల కోసం సమర్పిస్తున్నాం. ఈ జనరంజని వింటే రమేశ్ నాయుడు విశిష్టత ఆయన కట్టిన పాటల్లోనే కాక, ఒక మనిషిగా ఆయనలో కూడా ప్రతిఫలించిందని తెలుస్తుంది. ఈ ఆడియో మీకు నచ్చుతుందనే మా నమ్మకం.

నిడివి: షు. 25ని.

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)