రెండు శ్రీల విరించి – ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు
!!!

రెండు శ్రీల విరించి


శ్రీరంగం శ్రీనివాసరావు
02 జనవరి 1910 – 15 జూన్ 1983

తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈ సంచికను శ్రీశ్రీ స్మారక సంచికగా విడుదల చేస్తున్నాం. మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత వ్యాసాలను, అలాగే శ్రీశ్రీ సాహిత్యంలో అంత ఎక్కువగా పరిశీలనకు రాని విషయాలపై కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను కలిపి ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీ గురించి ఆయనమాటల్లోనే తెలుసుకునేందుకు ఆయనతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఈమాట పాఠకులకోసం శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ప్రత్యేక ఆకర్షణ.

ఈ సంచికలో మీకోసం: