శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం

శ్రీశ్రీ కవిత్వం మీద ఇప్పటికి బండ్లకొద్దీ వ్యాసాలు వచ్చాయనడం అతిశయోక్తి కాదు. మరయితే, మరోవ్యాసం ఎందుకూ అన్న ప్రశ్న రాక మానదు.ఆ ప్రశ్నకి సంపత్ గారి (కీ.శే. శంఖవరం సంపద్రాఘవాచార్య) వ్యాస పరంగా సమాధానం చెప్పడం తేలికే! సంపత్ గారి వ్యాసం 1952 భారతి మాస పత్రికలో వచ్చింది. అంతకుముందు శ్రీశ్రీ కవిత్వం పై వచ్చిన వ్యాసాలన్నీ, “అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే.” శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతకు (1952 కు) పూర్వం జరగలేదు. ఆ రకంగా చూస్తే, సంపత్ గారి వ్యాసం seminal work అని చెప్పచ్చు. ఈ వ్యాసం మొదటిసారి మే 2007 ఈమాటలో ముద్రించాము. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈ సమగ్ర విశ్లేషాణాత్మక వ్యాసాన్ని మరోసారి మీకు చదవమని గుర్తుచేస్తున్నాం.

శ్రీశ్రీ కవిత్వంపై.. మరో వ్యాసం – శంఖవరం సంపద్రాఘవాచార్యులు