పట్టుకో పట్టుకో

తెల్ల ఈక ఒకటి
కొన్ని పిట్టలు
నేనూదే సబ్బు బుడగలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఎర్ర తోక గాలిపటం
గాజు రెక్కల తూనీగలు
ఊదు కడ్డీ పొగల తీగెలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఆరేసిన పచ్చ చీర
నువ్వు రాసిన ఉల్లి పొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.