ఇంట్లో ఎవరూ లేరు

చేతులు చాపి తనలో తాను
పైన వెన్నుపూసలరిగిన ఫాను
లోలకంలా గాలిలో వూగుతున్న
కాగితాన్నొదిలిన పూర్తికాని వాక్యం
చేతి వేళ్ళ మధ్య కాళ్ళు జాపి
సోమరిగా జోగుతూ నా కలం
ఎండ వేళ హిమానీ పాతంలా
ముంచుకు వస్తున్న నిద్ర.