రెండు తీరాలు

వాంఛల్ని దాచుకున్న అలలు
ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే

వెన్నెల వేళ్లతో నిమిరి
చంద్రుడు ఓదారుస్తుంటే

సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకుని
రెప్పలకిందకి చేరుతుంటే

మౌనంగా

ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...