ఈమాట జనవరి 2008 సంచిక విడుదల

ఈమాట పాఠకులందరికీ
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈమాట జనవరి 2008 సంచికలో —

ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట

ఇంకా విశేషాలు —

 • సితార్‌ విద్వాంసులలో పండిట్‌ రవిశంకర్‌ అర్జునుడైతే, ప్రతిభలో కర్ణుడి వంటి ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మల్టీమీడియా వ్యాసం: “సర్వోత్తమ సితార్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌
 • దేవతలకూ, రాక్షసులకే గాక, ప్రాణం లేని ఘనస్వరూపాలకు కూడా అనేక ముఖాలుంటాయంటూ జెజ్జాల కృష్ణమోహన రావు గారి సచిత్ర వ్యాసం: “ప్లేటో ఘనస్వరూపాలు“.
 • ప్రేక్షకుల అభిమానానికి దూరమై కొడిగట్టిన తెలుగు నాటక సంప్రదాయం గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి వ్యాసం మొదటి భాగం: “తెరమరుగవుతున్న తెలుగు నాటకం
 • అతి శక్తిమంతమైన కంప్యూటర్లకు కూడా సులభంగా లొంగని సమస్యల గురించి తేట తెలుగులో కొడవళ్ళ హనుమతరావు గారి వ్యాసపరంపరలో మొదటి వ్యాసం : “కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న
 • నాకు నచ్చిన పద్యం” వ్యాస పరంపరలో, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో ఆరబోసిన వడ్లను దేవాలయపు జింక నుంచి కాపాడుకోవడానికి కష్టపడుతున్న పల్లెపడుచులను వర్ణించే పద్యం గురించి చీమలమర్రి బృందావన రావు గారి వ్యాసం.
 • స్వీయభాషలో విద్యాభ్యాసంపై ఔరంగజేబు అభిప్రాయాలను అనువదిస్తూ కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు చేసిన వ్యాఖ్యానం “ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము” 1910 – భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచికనుండి పునర్ముద్రణ
 • ప్రవాసాంధ్రులు ఎందుకు రాయాలో, చదవాలో వివరించే విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వ్యాసం: “ఎందుకు రాయాలో అందుకే చదవాలి
 • వినీల్ గట్టు, పాలపర్తి ఇంద్రాణి, దేవరపల్లి రాజేంద్రకుమార్, కల్పన రెంటాల, పద్మలత అయలసోమయాజుల, జే. స్వరూప్ కృష్ణ, రవికిరణ్ తిమ్మిరెడ్డి, సరిపల్లె సూర్యనారాయణ, మూలా సుబ్రహ్మణ్యం, “ఉదయకళ” గార్ల కవితలు – (వరుసగా): “యాత్ర“, “వాడు“, “కలలు కోతకొచ్చాయి“, “మెహఫిల్“. “నా జ్ఞాపకం“, “షరా మామూలే“, “అనుభవం – జ్ఞాపకం“, “నడిమి వయసు యిడుములు“, “రంగులు“, “సప్తపది
 • సాయి బ్రహ్మానందం గొర్తి, కె. వి. గిరిధరరావు, డొక్కా శ్రీనివాస ఫణి కూమార్ గార్ల కథలు – (వరుసగా): “అబద్ధంలో నిజం“, “నిన్నటి కల“, “కోవెలలో పకపకలు“.
 • ఈమాటకు రచనలు పంపగోరే వారికి సూచనలు

  • ఈమాటలో ప్రచురించే ప్రతి రచనను కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి అంచనాల ఆధారంగానే ప్రచురణ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇందుకు వీలుగా మీ రచనలని సంచిక ప్రచురణ తేదీకి కనీసం 2-3 వారాలు ముందుగా పంపమని మా మనవి. రచనలు RTS, లేదా యూనికోడ్ తెలుగులో కానీ ఈమైలు ద్వారా పంపాలి. పీడీయఫ్, జిఫ్, జేపెగ్ (PDF, gif, jpeg) రూపంలో, లేదా స్కాన్ చేసిన రాతప్రతులని పంపవద్దని మనవి. ఈ రూపాల్లో ఉన్న రచనలని, మళ్ళీ పూర్తిగా టైప్ చేస్తే తప్ప, యూనికోడ్ లోకి మార్చడం దాదాపు అసాధ్యం.
  • పుస్తక సమీక్షలు పంపగోరేవారు సాధ్యమైతే తాము సమీక్షించబొయే పుస్తకం ముఖచిత్రం కూడా పంపమని మనవి. అలాగే ఆ పుస్తకం వెల, ప్రతులు దొరికేచోటు వగైరా సమాచారం కుడా సమీక్షతో జత చేయాలి.
  • ఈమాట ఎలెక్ట్రానిక్ పత్రిక కాబట్టి, వ్యాసాలు పంపగోరే వారు వ్యాసంతో పాటు రిఫరెన్సులు (ఆన్లైను రిఫరెన్సులు –వెబ్ సైటు లింకులు అయితే మంచిది) పంపాలి.
  • వ్యాసంతో బొమ్మలు పంపేటప్పుడు, అవి ఇతర వెబ్‌సైట్లనించి తీసుకున్నవైతే, ఆ విషయాన్ని వ్యాసంలో పేర్కొనాలి.

  ఈ సంచిక నిర్మాణంలో సహాయపడ్డ సమీక్షకులు, రచయితలందరికి మా కృతజ్ఞతలు. పాఠకులు తమ అభిప్రాయాలని “బాగుంది, బాగులేదు” లాంటి ఒకటి రెండు మాటలతో కాకుండా, నిర్మాణాత్మకంగా ఉండేలా రాయమని కోరుతున్నాము.

  –సంపాదకులు