రంగులు

వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు

గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...