టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్

టంగుటూరి సూర్యకుమారి (వికీపీడియా సౌజన్యంతో)టంగుటూరి సూర్యకుమారి గారి పేరు వినని తెలుగు వాడు ఉండడు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ‘ పాటకి ఆవిడ ప్రాణం పోశారు. చాలా చిన్నప్పుడే, ఆరితేరిన గాయకురాలిగా, నృత్య కళాకారిణిగా ప్రసిద్ధికెక్కినన తెలుగు ఆడపడుచు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి రాజకీయ ఉపన్యాసాలకి నాందిగా ఆవిడ చక్కని జాతీయ గీతాలు పాడేవారట. ఎన్నోఆనాటి చలన చిత్రాల్లో నటించి ఖ్యాతి గడించారు.

ఇంగ్లండులో స్థిరవాసం ఏర్పరచుకొని, ఆవిడ మన తెలుగు వారి సాంస్కృతిక రాయబారి అయ్యారు. అక్కడ నృత్యకళాశాల పెట్టారు. ఎన్నో Shadow Plays ప్రదర్శించారు. 2005 ఏప్రిల్ లో స్వర్గస్తులయ్యారు, సూర్యకుమారి గారు.

విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది. ఈ పుస్తకం పొందదలచిన వారు వివరాలు డౌన్లోడు చేసుకోవచ్చు.