గ్రహ బలాబలాలు

సూర్యమాన గ్రహచారంలో
దలైలామా, అమెరికాఅధ్యక్షడూ కేన్సీరియన్లు
ఉభయులకూ కేంద్రం ఆత్మ.
ఒకరికి ఆదర్శం ఆత్మావలోకనం
రెండోవారు చేస్తున్నారు ఆత్మప్రదక్షిణం
ఒకరికి ఆలంబన విశ్వమానవసౌభ్రాతృత్వం
రెండోవారికి విశ్వం సర్వస్వామ్యసంకలితం.
ధృవాంతరసీమలకు విస్తరిల్లిన
వారి తేజోపుంజాలు
మిరుమిట్లు గొల్పుతున్నాయి
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
అలివికాని అంధకారంలో
మురికివాడలో నా ఇరుకుగదిలో
వెతుక్కుంటున్నాను
ఆల్చిప్పంత జాగాకోసం.
మూడోపాదం మోపనున్న వామనుడిలా.
నేను మూడో కేన్సీరియనుని.