ఈమాట » రెండు కవితలు

Expand to right
Expand to left

రెండు కవితలు

తూనీగ ముద్దు

ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ
తెరలు తెరలుగా..
సిగ్గు.

ప్రేమ

నీ స్పర్శే నాలోని పాటని మేల్కొలిపింది
నేను పూర్తిగా నీలో మునిగి ఉంటాను
కేవలం మనిద్దరి కలయికనీ చూడ్డానికే
ఒకర్నొకరు తోసుకుంటారు సూర్యచంద్రులు
పూవులు రాలిపోతుంటాయి
యుగాలు గడిచిపోతుంటాయి
నువ్వు మాత్రం నా మీంచి ప్రవహించి
ఎల్లప్పటికీ నన్ను తేటగానే ఉంచుతావు
మన విషయంలో మరుపు, జ్ఞాపకం
మొదలైన మాటలకి అర్థమే లేదు
గులకరాయి తన సెలయేటిని
గుర్తుంచుకోడమూ, మర్చిపోడమూనా!


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(9 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Sudheer Kumar Kothuri అభిప్రాయం:

    July 1, 2007 10:09 pm

    చాలా బాగున్నాయి….అద్భుతం!

  2. Kameswara Rao అభిప్రాయం:

    July 3, 2007 8:10 am

    మొదటి కవిత ముద్దుగా ఉంది. రెండవది పెద్దగా ఉంది:-)

  3. Raghothama Rao C అభిప్రాయం:

    July 11, 2007 10:06 pm

    మునుపు చదివినవే ఐనా మళ్ళీ చదువుతూవుంటే కొత్తగా అనిపిస్తున్నాయి. చాలా బావున్నాయి సుబ్బూ :)

  4. Prasuna అభిప్రాయం:

    July 25, 2007 4:49 pm

    ఎగురుతూ ఎగురుతూ ఉంటే వాన మబ్బు మీదకొచ్చినట్టుంది.
    చాలా బాగున్నాయి.

  5. mohanraokotari అభిప్రాయం:

    August 14, 2007 8:46 pm

    expression of love with experience it seems, an in depth one.

  6. Alok అభిప్రాయం:

    August 17, 2007 1:37 am

    మోహన్ రావ్ జీ

    అక్కడి రసాస్వాదనకి ఇక్కడి రసాస్వాదనకి తేడా లేదా?

  7. kbssarma అభిప్రాయం:

    August 25, 2007 6:38 am

    కవితలు చాలా బాగున్నాయి. అల్పం లో అనల్పం.

  8. KS Kiran Kumar అభిప్రాయం:

    August 31, 2007 1:27 am

    చాలా చాలా బాగున్నాయి.

  9. Ravi raj అభిప్రాయం:

    September 14, 2008 7:25 am

    నిముషం నిలువనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా?

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a