ముగ్గురు

కథ లోని పాత్ర
బాలేదని
పాఠకుడి ఏడుపు!

రోడ్డు మీద రాయి
తగిలిందని
పథికుడి ఏడుపు!

తన చేతిలో కప్పు
ఖాళీ చేసి
పిపాసి మౌనంగా నవ్వు…