ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ వారు రెండేళ్లకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని వంగూరి ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, శ్రీమతి మణి శాస్త్రి సంగీత విభావరి, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

సదస్సులో పాల్గొనలేనివారు దయచేసి చందాదారులు కమ్మని వంగూరి ఫౌండేషన్ వారి విన్నపం. పూర్తి వివరాలు»