జూలై 2006 సంచిక విడుదల

 “ఈ మాట” పాఠకులకు  స్వాగతం! ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి.

  • ఈ వారాంతంలో జరుగుతున్న “ఆటా” సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన కథలు,కవితలు,వ్యాసాలు, నవలికలతో పాటు మొత్తం ఆటా సూవనీర్ గ్రంథాన్ని (కబురు) ఈమాట సాహితీ గ్రంథాలయం ద్వారా అందజేయడం. ఇందుకు కారకులైన మురళీ చందూరి గారికి మా కృతజ్ఞతలు.
  • ఈ మధ్యే కన్ను మూసిన ప్రముఖ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణగారికి, ప్రఖ్యాత సినీ సంగీతదర్శకుడైన నౌషాద్ గారికి నివాళులుగా వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని విశదపరిచే రెండు వ్యాసాలు.
  • ఈజిప్ట్ పై యాత్రావ్యాసం
  • నిడుదవోలు మాలతి, సావిత్రి మాచిరాజు, అక్కిరాజు భట్టిప్రోలు, లైలా యెర్నేని గార్ల కథలు
  • ఇంకా ఎన్నో కవితలు, వ్యాసాలు, సమీక్షానువాదాలు.

పాత సంచికల యూనికోడీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. తప్పొప్పులను సమీక్షించి రెండు, మూడు వారాల్లోగా పాత సంచికలన్నింటినీ మీ అందుబాటులోకి తీసుకురాగలమని అనుకుంటున్నాము.ఈ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను స్వీకరించి హైదరాబాద్ లోని తన ఉద్యోగుల ద్వారా  గత పదిహేను రోజుల్లోనే ఎనమిది వందల పైచిలుకు రచనలను తర్జుమా చేయించిన verudix.com కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీధర్ పాలెపు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ సంచిక మీకు నచ్చుతుందనీ, దీనిలో రచనలపై విరివిగా అభిప్రాయాలు, విస్తారంగా విమర్శలూ, సహృదయ సమీక్షలు వస్తాయనీ ఆశిస్తున్నాము.

మరుసటి సంచిక విడుదల సెప్టెంబర్ 1, 2006.

జూలై 2006 సంచిక | ATA 2006 సూవనీర్ (కబురు)
కథలు | కవితలు | వ్యాసాలు | అనువాదాలు | సమీక్షలు