నిద్ర

వేసవి రాత్రి మేడ మీద
వెల్లకిలా పడుకుని
పల్చని దుప్పటీ కప్పుకుని
నేను

ఆకాశంలో
చుక్కల పరుపుపై
మబ్బుల దుప్పటీ కప్పుకుని
చంద్రుడు

ఇద్దరం
ఒకరినొకరం చూసుకుంటూ
మౌనంగా మాట్లాడుకుంటూ
మెల్లగా నిద్రలోకి జారుకున్నాం!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...