దారి బత్యం

ఏ ఏ దారుల్లో
ఎన్ని మార్లు
చిల్లిగవ్వైనా లేకుండా
నడిచిన చిత్రవధో

********
శవాల మీద
విసిరే నాణేల్ని
ఏరుకునే వార్ని
వాడుకునే వార్ని
గమనించిన బాధో

********
ఎంత పెద్ద నోటున్నా
చిల్లరగా మార్చలేని
చిన్నబోయినతనమో

*******
అవసరానికి
చిల్లరపైసలు
అర్థరాత్రో
అపరాత్రో
ఎక్కడా కొనుక్కోలేని
ఎంత వెదికినా దొరకని
అనుభవమో

********
ఆఖరి దారి బత్యంగా
నాన్న వదిలిన
పైసలు
ప్రేమ
మేము