కాటుక తిలకం కుంకాలు శతమానం పూసలు

ఓలమ్మీ! గాజులు పిన్నీసులు జడ కుచ్చులు లోలాకులు చాదుబొట్టు కొనుకుంతావా?!
ఓలి పిల్లా!
పొగడరు ముచ్చిబొట్లు సక్కబొట్లు రంగుబొట్లు
స్నోముద్దలు సవరాములు చెంపపిన్లు కొనుకుంతావా?!

కాటిక తిలకమ కుంకాలు శతమానం పూసలు !
(కేక)

ఓలి బొట్టీ?!
రిబ్బను పట్టుతాడు గోరింటలు గోలరంగు వాసనూని
అగరుబుడ్డి అంగార పచ్చి పసుపు
కాటిక తిలకాములు కుంకాములు శతమానం పూసలోలి బొట్టీ?!
ముకునత్తులు సెవినత్తులు సరిగజ్జెలు అందిలీలు బావిలీలు
గోలరంగు కాలరంగు పారాణీ బుక్కా బరుగుండా కరుపూరము గుడ్డు సబ్బు కొనుకుంతావా?!

ఓలి పిల్లా! రంగు జోలు దంతంపన్ని నక్లీసులు సన్నగొలుసు ఉంగరాలు
మెట్టిలు జడపిన్నులు మెడపిన్నులు చెంపపిన్లు, ఓలి పిల్లా?!

కాటిక తిలకమ కుంకాలు శతమానం పూసలు !!

(మూలం : వీధిలో అమ్ముకునే మామ్మ పాట)