“ఈమాట”కు నాలుగేళ్ళు నిండుతాయి..

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!

వచ్చే అక్టోబరుకు “ఈమాట”కు నాలుగేళ్ళు నిండుతాయి. ఈ సందర్భంగా నవంబర్‌ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త)లందరి సహకారం ఎంతో అవసరం అని వేరే చెప్పనక్కర్లేదు. వీలైనంత త్వరలో మీమీ రచనల్ని పంపితే వాటిని ఈ ప్రత్యేకసంచిక కోసం పరిశీలిస్తాం. త్వరపడండి!

సుప్రసిద్ధ కవి శ్రీ అఫ్సర్‌ ఇకనుంచి “ఈమాట”కు క్రమం తప్పకుండా తమ కొత్త రచనల్ని అందించబోతున్నారు. వారికి మా హార్దికాహ్వానం.