మల్లెలు

ఏదో మొదలు లేని బాధ

దిగంతాలు నిండే

తెల్లని మల్లె పూలు

గుట్టలుగా గుమ్మరించేవరకూ

ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో

ఏరిన మల్లెలు

తోటలోనివి

తోపుల్లో దొరికినవి

నవ్వుతూ,వడలిపోయి

తుళ్ళుతూ,వాడుతూ

రెక్కలుతెగి

అల్లలాడే మల్లెలు

దొరికిన మల్లెలు

ప్రాణంగా తెచ్చి

భారం భరించలేక

నేను పోసే రాశులు

వేరొకరి రాశులతో

మరి నాకు పని లేదు

వేగుచుక్క పొడిచేదాకా

ఈ గుట్టల్లో బ్రతుకుతాను