“ఈమాట” కొత్త చిరునామా!

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!

అనుకోని అనేకమైన సాంకేతికమైన ఇబ్బందుల నుంచి బయటపడి కొత్త చిరునామాతో మీముందుకు వస్తోంది ఈ సంచిక. ఇప్పుడు “ఈమాట” కు శాశ్వతమైన స్థలం దొరికినట్టే. ఇకముందు ఎలాటి సమస్యలు ఉండకూడదు. ఓపిగ్గా “ఈమాట” కోసం నిరీక్షిస్తూ, మాకెంతో ప్రోత్సాహం ఇచ్చిన మిత్రులందరికీ మా హార్దిక వందనాలు. సాంకేతికంగా ఎంతో సహకారం అందించిన శ్రీయుతులు చోడవరపు ప్రసాద్‌, కన్నెగంటి రామారావు, జువ్వాడి రమణ గార్లకు మా కృతజ్ఞతలు.

గత మూడేళ్ళుగా “ఈమాట” లో వచ్చిన రచనల నుంచి ఉత్తమమైన వాటిని ఒక సంకలనంగా పుస్తకరూపంలో తీసుకువస్తున్నాం. వెబ్‌ మీద కూడ ఒక కాపీ ఉంటుంది. ముందు ముందు కూడ ఇలాటి సంకలనాల్ని తీసుకురావాలని పథకం.

ప్రతిభావంతులైన రచయిత్రు(త)ల సహకారం వల్లనే ఇది సాధ్యమౌతుంది. ఇప్పటివరకు రచనల్ని “ఈమాట” కు పంపుతున్న వారే కాక కొత్త వారు కూడ వారి అనుభవాల్ని, అనుభూతుల్ని, భావాల్ని రచనల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి తోనూ పంచుకుంటారని మా ఆకాంక్ష.