ఒక్క క్షణం

ఎగిరిన ప్రతిసారి
క్షేమంగా దిగేవి
విమానాలు కావు

శాశ్వతంగా
పట్టాలమీదే పయనించేవి
రైళ్ళు కావు

ఆహ్లాదం నుండి
ఆనందం నుండి

ప్రమాదం లోకి
జారడానికి

పట్టేకాలం
ఒక్క క్షణం