పీక

సిగరెట్టును
తగలేస్తారు
పొగరంతా తగ్గి
పొగయిపోగానే
పీకను నలిపేస్తారు
నాకుమాత్రం
బ్రతకాలని ఉండదా?
సుతారంగా, కొంత
సున్నితం పాటించి
నన్నిలా వదిలేయండి!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...