శిశిరం లో చెట్టు

అన్నీ వదులుకోక తప్పదని
చిన్నపాటి  చెట్టుక్కూడా తెలుసు
విలవిలలాడిపోతారు మీరు
గలాభా చేయడం మాని
పగటి ఎండను, రాత్రి వెన్నెలను
నిగర్వంగా ఆహ్వానించి
చతికిలపడిపోకుండా
ప్రతిగాలి తెమ్మెరను పలుకరించి
కదలకుండా నిలబడగలిగితే
ఇదేమీ పెద్దవిద్య కాదు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...