మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం!

ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక రూపంలో ఉన్నా లేక ఇంటర్‌నెట్‌ మీద ఉన్నా వాటిని సమీక్షించటానికి “ఈమాట” తగిన
సమీక్షకుల్ని చూసి వారి చేత అభిప్రాయాలు రాయిస్తుంది. “ఈమాట”కు ఈమెయిల్‌ పంపితే ఏ అడ్రస్‌కి మీ పుస్తకాలు పంపాలో చెప్తాం. ఐతే మాకు వచ్చిన వాటన్నిటినీ సమీక్ష చేయించటం సాధ్యం కాకపోవచ్చునని వేరే చెప్పనక్కర్లేదు కదా! అలాగే గత రెండేళ్ళలో ప్రచురించబడ్డ రచనల్నే సమీక్షకి స్వీకరిస్తాం. సహజంగానే, ఆంధ్రప్రదేశ్‌ బయట వుంటున్న రచయిత్రు(త)లకు ప్రాధాన్యత ఇస్తాం.

ఈ సంచిక కూడ మీరు ఆశించే విధంగా ఆకర్షణీయంగా చెయ్యటానికి ప్రయత్నించాం. ఆదరించటం మీ వంతు.

ఈ సంచిక బయటకు రావటానికి ఓ రోజు ఆలస్యమౌతోంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల. ఎంతో శ్రమ తీసుకుని వాటిని పరిష్కరించిన శ్రీ చోడవరపు ప్రసాద్‌ గారికి మా కృతజ్ఞతలు.