కొత్త సహస్రవత్సరాదికి సుస్వాగతాలు

“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు.
క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. అలాగని ఇందువల్ల మిగతా శీర్షికలకి ఏమీ లోపం కలక్కుండా యధాప్రకారం గానే కథలు, వ్యాసాలు, ప్రత్యేక రచనలు కూడా ఉన్నాయి.

గెస్ట్‌ బుక్‌ ద్వారా, ఇతర మార్గాల ద్వారా మీనుంచి అందుతున్న సలహాలను పరిశీలిస్తున్నాం. ఆచరణీయమైన వాటిని తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తాం.

క్రితం సంచికలో చెప్పినట్టు ఇంతవరకు “ఈమాట” లో ప్రచురించిన అన్ని రచనల్ని ఒకే చోట చూసే వీలు కలిగిస్తున్నాం. ఇది పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందని మా ఆశ.
 
మీకు నచ్చిన లేదా నచ్చని ఏ రచన గురించి గానీ లేక మొత్తం సంచిక గురించి గాని మీ అభిప్రాయాలు రాస్తే అవి రచయిత్రు(త)లకూ మాకూ ఎంతగానో ఉపయోగిస్తాయి.