ఉదయపు గాలి తాకిడికి కలల గాలిపటం తెగడంతో చటుక్కున లేచి కూచుంటాం. తెగిన గాలిపటం ఏ మరుపు పొరల చింతగుబురుల్లోనో చిక్కుకొని, మరి కనిపించటం […]

ఒక ఊరితో సంబంధం హఠాత్తుగా తెగిపోతుంది. ఆప్యాయం గా ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్న బంధం స్ప్రింగులా విడిపోతుంది. అనుకోకండా ఆకాశం రంగులు మార్చినట్టుగా, […]

నేననుకోవడమేగాని, ఈ మంచుగడ్డని నేను పగలగొట్టలేను. మన మధ్య మాటల వంతెన కట్టలేను. ఇవ్వి నేను ప్రేమతో పెంచుకొన్న పువ్వులు మరిమరీ ముడుచుకుపోవటమే తప్ప […]

నిండైన దీని జీవితాన్ని ఎవరో అపహరించారు. దీని బలాన్ని, బాహువుల్ని, వేళ్ళని, వైశాల్యాన్ని, నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని, ఎవరో నిర్దయగా, నెమ్మదిగా, అందంగా అపహరించారు. […]

పొలిమేరల్లో ఉన్న ఊళ్ళోకొచ్చిన పులిలా చప్పుడుకాకుండా కాలేజీ కేంపస్‌ లోకి కాలుపెడుతుంది జ్వరం. ఇక్కడి మనుషులు నిరాయుధులని, వీళ్ళ మధ్య యే బలమైన బంధాలూ […]

అక్కడున్న అందరి మనసుల్లోని దుఃఖాన్నీ ఆవిష్కరించే బాధ్యతని ఒక స్త్రీ నయనం వహిస్తుంది. ప్రకటించక, ప్రకటించలేక, పాతిపెట్టిన వందల మాటల్ని ఒక్క మౌనరోదన వర్షిస్తుంది. […]

ఇతనికెవరూ వీరత్వాన్ని వెన్నతో పెట్టి తినిపించలేదు. ఒళ్ళో కూచోబెట్టుకుని, సాహస గాధల్ని ఓపిగ్గా వినిపించలేదు. అయినా, ఉదయమయ్యేసరికల్లా ఈ పసివాడు మృత్యువు గుహలోకి నడిచిపోతాడు. […]

ఓ రాత్రివేళ అంతటా నిశ్శబ్దం ఆక్సిజన్‌ లాగా ఆవరిస్తుంది. వాయించని కంజరలాగా చంద్రుడు, మోయించని మువ్వల్లాగా చుక్కలు ఆకాశం మౌనం వహిస్తుంది. వీధిలైట్లన్నీ తలవంచుకొని, […]

కొన్నిసార్లు ఆడకుండానే విరమించవలసి వస్తుంది. సకలాలంకారాలూ చేసుకొని సర్వ సన్నద్ధంగా ఉన్నా, నీ పాత్ర రాకండానే నాటకం ముగింపుకొచ్చేస్తుంది. నూరిన నీ కత్తి వీరత్వాన్ని […]

నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది. వీడైతే దానిని నూరేళ్ళూ మోయవలసినవాడు. ఇంకా నీ బెల్టు చారల్ని, వేళ్ళ ఆనవాళ్ళని కూడా ఎక్కడ […]

మూత విప్పగానే అత్తరులా గుప్పున గుబాళించడం నాకు తెలీదు. తలుపు తియ్యగానే ఏ.సి.లా ఊహించని స్నేహపు చల్లదనంతో ఉక్కిరి బిక్కిరి చెయ్యడం నాకు చేతకాదు. […]

పాపం దానికేమీ తెలీదు. దాన్నేమీ అనకండి. మనం ఛేదించలేని మృత్యు రహస్యాన్ని అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది. వేళ్ళలా చుట్టుకున్న వరల వెనకాల్నించి ఎవరు […]