ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది.

ప్రవాసాంధ్ర సాహిత్యం ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత […]

మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.

ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.

ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా – చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….

పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి…

ఇమామ్‌ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచనల్లో పడి ఎప్పుడు పొద్దు గూకిందో తెలియలేదు. మసక మసకగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఊరు ఇంకా చాలా దూరంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. షాదుల్‌ గుర్రు గుర్రుమని వెంబడిస్తున్నాడు.
‘నీకు చేస్తున్న అన్యాయానికి నన్ను చంపేయకుండా ఎందుకురా …. గుడ్డిగా నమ్ముతున్నావు’ అనుకున్నాడు ఇమామ్‌ షాదుల్‌ను చూస్తూ.
ఇంటికి వెళ్ళాక తను చెప్పిన ఉపాయం పారుతుందా అన్న ఆలోచన ఒకవైపు …. దినదిన గండంగా షాదుల్‌ను ఎన్ని రోజులు ఇలా తప్పించగలను అనే ఆలోచన ఒకవైపు పట్టి కుదిపేస్తుంటే ఇమామ్‌ నడక వేగం తగ్గింది.

అట్లా సారంపల్లిలో దిగినప్పుడు మండలానికి నడిచిపోయి ఎస్సైని కలిసిండు చాంద్‌. ఎస్సై ‘ఆడుక పోండ్రిరా’ అన్నాడు. ఎంత ధర్మాత్ముడు అని చాంద్‌ అనుకున్నాడు.
ఏదో కేసు మీద సారంపల్లి వచ్చిండు ఎస్సై. బజార్లో ఆడుతున్న తండ్రి కొడుకులను చూసి బూతులందుకున్నాడు.
‘‘దొరా …. మొన్న మా కొడుకు కలిసిండు గదా …. మీరే ఆడుకొమ్మంటిరి’’ ఇమామ్‌ అన్నాడు.
‘‘అరేయ్‌ …. స్టేషన్‌కు రాండ్రి మీ సంగతి చెప్పత’’ ఎస్సై అన్నాడు.

‘అమ్మీ …. ఇయ్యాల్లనన్నా పీడ వదిలిపోతదంటవా ….’ చాంద్‌ అడిగాడు.
‘వదిలి పోతదిరా …. పొగాకు మందు గట్టిది. ఎనుకట మా మామ పెట్టిండు’ బీబమ్మ అన్నది.
‘దేనికి ….? ఎలుగుకా ….’’ అడిగిండు చాంద్‌.

‘అబ్బా … అరే అబ్బా …’ చాంద్‌ మాటలతో ఉల్కిపడి తేరుకున్నాడు ఇమామ్‌. మంచంలోంచి లేచి కొడుకు వైపు చూసిండు. నిలువెత్తు గోతిలోంచి బయటకు వచ్చిండు చాంద్‌. వచ్చి తండ్రిని మరోసారి పిలిచిండు చాంద్‌.
ఇమామ్‌ బదులు పలుకలేదు. లేచి కూర్చున్నాడు. బీబమ్మ కోసం చూశాడు. బీబమ్మ వాకిట్లో కొంగు పరుచుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టు గుర్రు వినిపిస్తుంది. ఇమామ్‌కు కోపం వచ్చింది. కోపంతో బాధ కూడా కలిగింది.

‘అరే ఇమామ్‌ …’’ వాకిట్లో నిలబడి పిలిచాడు చంద్రయ్య.
ఇమామ్‌ తండ్రి చనిపోయి అప్పటికి సరిగ్గా ఏడాది. తండ్రి చనిపోయిన రోజే తండ్రి తెచ్చుకున్న ఎలుగు చనిపోయింది. తండ్రి చనిపోయి తోడు దూరమై ఎలుగు చనిపోయి బతుకు దెరువు దూరమై పుట్టెడు దు:ఖంతో ఉన్నాడు ఇమామ్‌.

పొద్దు పొడిచింది.
పొద్దు గూకింది.
పగలు గడిచింది. రాత్రి గడిచింది.
ఇమామ్‌ రాలేదు. షాదుల్‌ జాడలేదు.
వాళ్ళు రాకపోవడం బీబమ్మకు సంతోషంగా ఉంది. చాంద్‌కు సంతోషంగా ఉన్నా లోలోపల భయంగా ఉంది. ఇద్దరూ ఇంట్లకూ బయటకు తిరుగుతున్నారు. అడుగుల చప్పుడైతే ఇమామ్‌ అనుకుని చూస్తున్నారు. గురక వినిపిస్తే షాదుల్‌ అనుకుని ఉల్కిపడుతున్నారు.

పొద్దు చల్లబడింతర్వాత –
పడమటిళ్ళ నీడలు వీధుల్లోకి పాకిన పిదప –
గుడిముందంతా ఆక్రమించుకొన్న వేపచెట్టు నీడలో కొందరు హుషారుగా పన్జేస్తున్నారు.
గుంతలు తవ్వేవాళ్ళు తవ్వుతూ ఉంటే, కూసాలు బాతే వాళ్ళు బాతుతున్నారు. అడ్డకొయ్యలు కడుతున్నారు. కొందరింకా కొయ్యలు మోసుకొస్తున్నారు. మోకులు చంకకు తగిలించుకొస్తున్నారు.

తుది రోజు
ఆట ఒప్పందం తర్వాత బొమ్మలాట కళాకారుల యోగం మారిపోయింది.
ఉదయం లేచి చెంబుపట్టుకని వంకలోకి వెళ్ళేసరికి వాళ్ళను వెదక్కొంటూ పాములేటి వచ్చాడు.
పళ్ళు తోముకొనేందుకు వేపపుల్లలు విరిచి ఇచ్చాడు.
చిక్కటి పాలు, చక్కెర, కాఫీపొడి పంపాడు గుడి వద్దకు.

పెద్ద మనుషుల ఇళ్ళన్నీ మరోసారి తిరిగాడు గోవిందరావు.

ఆట ఒప్పుకొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

‘‘ఆట ఒప్పించుకొనే దాకా మా కాళ్ళో కడుపో పట్టుకొంటారు. తాంబూలమిచ్చినాంక పరదాగుడ్డలనీ, మెరుగు ఆముదమనీ, కాల్ల కింద చెక్కలనీ, దీపాలనీ, కోడిపిల్ల అనీ, సారాయి సీసాలనీ …. మా పానాల్దీస్తరు …. మీ సావాసమొద్దు నాయనా! ఊరున్నమ్ముకొని ఒచ్చినందుకు …. అంతో ఇంతో కూలిబాటు ఇస్తాం …. తీసుకొని మీ దావన మీరు బోండి ….’’ చెప్పారు కొందరు ముసలాళ్ళు.

తండ్రి పడే అగచాట్లన్నీ కమలాబాయికి తెలుస్తూనే ఉన్నాయి.

ఇల్లిల్లూ తిరిగి అందరికాళ్ళు పట్టుకన్నా ఎవరి మనస్సూ కరగలేదనే విషయం అర్థమవుతూనే ఉంది.

భోజనం ఏర్పాట్లు ఒక గాడిలో పడ్డాయి. మొహం విరుపులతోటో, తప్పని తద్దినం గానో కొన్ని ఇళ్ళల్లోనైనా తిండి దొరుకుతోంది.

ఆట ఆడించాలనే నాన్న తపన, ఆరాటం ఆమెను కదిలించాయి.

గ్రామ పెద్ద రాఘవరెడ్డి ఇంటినుంచి బియ్యం, బేళ్ళు, ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు వగైరా సంభారాలు రావటంతో – ఆయమ్మనో ఈయమ్మనో అడగకుండా చట్టీ ఇప్పించుకని గుడి వద్దనే పొయ్యి రాజేసింది కమలాబాయి.

ఎర్రమట్టి నీళ్ళలో కందుల్ని నానేసి, ఎండబెట్టి, సాంప్రదాయిక పద్ధతిలో తయారుచేసిన కందిబేడల పప్పూ, వేడి వేడి అన్నమూ పాత రోజుల్ని గుర్తుజేసి ఏదో తన్మయా భావన కలిగించింది గోవిందరావుకు. రుచిగ్రంథులు ఎండిన నాలుక చెలిమల్లో తేమ ఊరించాయి.

గ్రామంలోని ఆడవాళ్ళకు సులభంగానే పరిచయమయ్యింది కమలాబాయి. ఆమె తల్లి లక్ష్మీబాయితో ముసలాళ్ళందరికీ సన్నిహిత సంబంధాలుండేవి కాబట్టి ఆమె పని సులువైంది. తత్ఫలితంగా అంబలి పొద్దు మీరక ముందే మనిషికో ముద్ద సంకటి దొరికింది. ఉడుకుడుకు సంకటి, వేరు సెనగల పచ్చడి, మటిక్కాయల తాలింపు జిహ్వకు రుచిగా అన్పించింది.