ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి.

ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలియలేదు. బహుశా ముందు పెద్దవి. ఆమే అంది “వాషింగ్ మెషీన్ నేను తీసుకుంటాను. ఫ్రిజ్ నువ్వు తీసుకుంటావా?” “సరే.” వాటికి రెండు రంగుల స్టిక్కర్స్ అంటిస్తూంది గుర్తుగా. పద్ధతిగా అనుకున్నట్టు జరగాలామెకు. బెడ్స్, సోఫా, టేబుల్స్, టీవీ, వాటి మీద పేరుకున్న ఉదయాలు, సాయంత్రాలు, రాత్రులు, మాటలు, నవ్వులు, భోజనాలు, తిట్లు. ఆ జ్ఞాపకాల బరువుకు అన్నీ కుంగిపోతున్నట్టు ఉంది.

గురువుల వంటి చిత్రకారుల పనితనం చూడ్డం, చిత్రకళా పుస్తకాలు చూపించిన తోడన్, తోన్ తోడ కూడనే కాకుండా వీలయినంత మంచి రచనలు చదువుకుంటూ తృతీయా విభక్తి కూడా తెలుసుకోవాలి. గొప్ప గొప్ప రచనలను చదవాలి. ఆ చదువు ఏం చేస్తుందంటే, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా గొప్ప ఊహాశక్తిని మన మనసుకు ఊదుతుంది.

రాయిని ఆడది చేసిన రాముడివా! సినిమా పాటగా ఈ వాక్యం ప్రసిద్ధమైనా, నిజానికి ఇందులో కొంత తిరకాసుంది. అదేమిటో పదాలను కాస్త అటూయిటూ చేస్తే తెలుస్తుంది. ఈ వాక్యం చూడండి: ‘ఆడది రాయిని చేసిన రాముడివా!’ దీని అర్థం ఏమిటి? ఒక ఆడదాని చేత రాయిగా మారిన రాముడివా అని అర్థం వస్తుంది. ఇలా పదక్రమం మార్చడం వల్ల అర్థం మారిపోయిందంటే అది సరైన తెలుగు వాక్యం కాదని లెక్క.

గట్టెక్కక పట్టుబడక
ఒట్టిచేతుల మెట్టమాటల
మొనాటనీ గుటకల గటగట
మధ్యకుట్టులో మూతపడ్డ పుస్తకం
మిథ్యా వాస్తవ మీటలపై
వేలికొనల పలవరింతల
డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్

చిన్నోడికి రోజూ ఓ కథ కావాలి. పెద్దోడికీ ఆసక్తేగానీ అడుగుతాడు, వదిలేస్తాడు; వీడంత మంకుపట్టు పట్టడు. తెనాలి రామకృష్ణ కథలు, ఈసప్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, మర్యాద రామన్న కథలు, ఇట్లాంటివేవో నాకు గుర్తొచ్చినవి చెప్తుంటాను. ఒకరోజు, ఎంత గింజుకున్నా ఏ కథా గుర్తు రాక, ఏదో మేనేజ్‌ చేయొచ్చని డోరియన్‌ గ్రే మొదలుపెట్టాను.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది.

సంక్రాంతికి బయట నాలుక్కూడలిలో
మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా?
ఆ మంచు కురిసిన పొద్దున్న మంట దగ్గిర
నీ చేయి పట్టుకుని చలి కాచుకుంటూంటే
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ

వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ బోస్ డికె’ అనడమే కద్దు.

నిజానికి, ‘నీ రచన చాలా గొప్పగా ఉంది’ అని వచ్చే విమర్శ వల్ల (నిజంగానే ప్రతికూల విమర్శకు అందని రచనైనా సరే) రచయితకు తాత్కాలికానందం తప్ప వేరే ఏ ఉపయోగమూ ఉండదు. రచయితలు అదే కావాలనుకుంటే భజన సంఘాలనేర్పరచుకోవడం తేలికే! (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)

నేను మాదేవి ఇద్దరం గల్సి బువ్వమ్మవ్వ దగ్గర్కి పోతిమి. చల్ల కాలం కదా, స్కూల్ గోడ నీడ బలే సల్లగుంటది. గోడానాంకుని బువ్వమ్మవ్వ సిన్న చక్క పెట్టెలో వక్కో అరలో బటానీలు, రేక్కాయిలు, బుడ్డలు, పత్తి పండ్లు పెట్టుకుని అమ్ముకుంటా ఉంటాది. బువ్వమ్మవ్వ ఏం వయ్సో తెల్దు గాని బాగ ముసిలిగుంటది. నేనైదు పైసలు పెట్టి రేక్కాయలు కొనుక్కుంటి. మాదేవి బుడ్డలు కొనుక్కునె.

మట్టిరంగు ఆకుపచ్చ అంచు
కొత్త కొత్త ఆశలు, ఆకాశం హద్దు
అక్షింతల్లా మంచు కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

అక్షరాలే తప్ప ఆస్తులు బొత్తిగా లేని సామాన్య కుటుంబానికి చెందిన మనిషి వాడ్రేవు పాండురంగారావు. ‘ఇంగ్లీషు మీద చిన్నప్పట్నించీ విపరీతమైన వ్యామోహం’ ఉన్న మనిషి. భాషా చదువూ అంటే ఎంత ఇష్టం ఉన్నా, హైస్కూలు చదువుతో విద్యను పక్కనబెట్టి టెలిగ్రాఫిస్టు ఉద్యోగాన్ని అందుకొన్న మనిషి.

ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది.

మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. ‘స్వరముల తూగే ఘనరాగమయివో’ అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను.

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

ఇదిగో అదిగో అంటూనే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై ఏళ్ళ వయసొచ్చేసింది. సాహితీ సమితి సంబరాలకు తోటి సాహిత్యాభిమానులతో కలిసి సదస్సు నిర్వహించుకోవడంకన్నా సబబైనది మరొకటి ఉండబోదు. అందుకే తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్‌కు ఆహ్వానిస్తున్నాం.

గడినుడి 17కు ఈసారి గడువు తేదీలోపు ఇద్దరు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. 1. సుభద్ర, 2. భమిడిపాటి సూర్యలక్ష్మి. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ముగ్గురు: 1. కార్తిక్ చంద్ర పివిఎస్, 2. కోమలి గోటేటి, 3. జివిఎస్ఎస్ మార్కండేయులు. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 17 సమాధానాలు, వివరణ.

లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను.