ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ల పొగిడేవారు. అతన్ని పెళ్లాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్లి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.

“రాగమ్మ అసాధ్యురాలు. పత్తి వొలవడానికి చేలోకి దిగితే, ఎక్కేప్పుడు మల్లె చెండంత పత్తి కొప్పులో పెట్టుకుని గట్టెక్కేది. మేస్త్రీ కదా, అందరికీ నేర్పింది. పత్తి వొలుపులు అయ్యేసరికి రాగమ్మ క్వింటాల్ పత్తి తూకం వేసేది…” మావయ్య మాటకి అడ్డంపడి, ‘చిన్న బిడ్డలకి యివన్నీ దేనికిలే సామీ…’ అంటూ గుర్రాల పొట్లం అందించింది రాగమ్మ. మావయ్య యిచ్చిన నోట్లని కళ్లకద్దుకుని తీసుకుంది.

“నేను ఇక్క‌డికి వ‌చ్చింది నీతో చ‌ర్చలు చేయ‌డానికి కాదు. మా టీమ్‌లో వెంకట్ ఉన్నాడు నీకు తెలుసు క‌దా, మ‌న కుల‌మే… చూడ్డానికి బాగుంటాడు.(అదోలాంటి న‌వ్వు. ఆ న‌వ్వు గురించి నాకు తెలిసినంత బాగా ఎవ‌రికీ తెలీదు.) ఇప్పుడు కెన‌డాలో జాబ్ వ‌చ్చింది. వెళ్లేముందు నా అభిప్రాయం అడిగాడు. కాద‌ని చెప్పేందుకు కార‌ణం ఏదీ క‌నిపించ‌లేదు. వ‌చ్చే ఆదివారం వాళ్ల పేరెంట్స్ మా పేరెంట్స్‌తో మాట్లాడేందుకు వ‌స్తున్నారు. నీ అభిప్రాయం ఏంటి?”

ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.

విష్ణువు అంటాడు కదా, ‘నువ్వు నన్ను వదిలిపోయినప్పటి నుంచీ, ఇదిగో ఈ పుట్టలో నిన్నే తలుచుకుంటూ కూర్చున్నాను. పశులకాపరి నా తల పగలగొట్టినప్పుడు ఆ బాధకు ఓర్చి నేనిలా ఉన్నానంటే అది నీ మహిమే. నీ పాతివ్రత్య నిష్ఠ చేతనే నేనింకా బతికున్నాను. అదలా ఉంటే, ఈ ఆకాశరాజ కన్య నన్ను మోహించి నా వెంటపడింది. అందుకామెను పెళ్లిచేసుకోవలసి వచ్చింది. అది కూడా నువ్వు ఒప్పుకొంటేనే సుమా! నువ్వు కాదంటే నాకీ పెళ్లి వద్దు.’ ఇవీ ఆయనగారి మాటలు! అయినా అమ్మవారి దగ్గరా ఆయన మాయలు?

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.

ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కిదూకడమే!

యాత్రల్లో పరాయివాళ్లు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్లినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్లు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్లముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్లందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది

మేం వుంటున్న యింటి యజమానురాలు శాకాహారి కాదు. అయినా శర్మకు అభ్యంతరం కలిగేలా ఏనాడూ ప్రవర్తించకపోవటాన మేం మరో చోటికి పోవల్సిన అవసరం కలగలేదు. ఆవిడకి బంగారపు బొమ్మలాంటి కూతురు వుండేది. రోహిణి ఆ అమ్మాయి పేరు. అప్పటికే వివాహితుడు కావటం మూలానా, పైగా పరస్త్రీని చూడకూడదనే నియమం కలవాడు కావటం మూలానా శర్మ ఆ అమ్మాయి సంగతే పట్టించుకునేవాడు కాదు. నాకు మాత్రం ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నరాలు జివ్వుమనేవి.

మరణముఖమును అరయుచున్నను ఇంత చక్కగ, నింత భావస
మంచితంబుగ నల్లినాడవు మేదినీసుర! నీదు కవితను

నీదుమహిమను నేనెఱుంగక నీకు వేసితి నిధనశిక్షను.
నాదు సుతపై నీదు ప్రేమము ఉత్తమాశయయుత మద్వితీయము.

ఈ మునిమాపు వేళ
గుబురుకున్న పొదలమధ్యలోంచి
తాటిచెట్ల నీడలు మొలిచినట్టున్న
వూరి అంచులోకి
నా నడకకు
సందిగ్ధంగా దారిగీస్తూ
అక్కడేదో ఓ మలుపు –

ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.

గడినుడి 10కి ఈసారి చాలా ఆలస్యంగా ఇద్దరు మాత్రమే తప్పుల్లేని పరిష్కారాలు పంపగలిగారు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. శ్రీవల్లీ రాధిక. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ ఇద్దరు విజేతలకు అభినందనలు.

గడి నుడి – 10 సమాధానాలు, వివరణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.