మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటీ తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీమీద వేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్లూ మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వొక్క ద్రోహం మాత్రం చేశావు. అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు. తెలీనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవీ అక్కర్లేదు. మనం మనుషులమే కదా!

తాను ఈమధ్యే ఒంగోల్లో చూసొచ్చిన కొండవీటి దొంగ సినిమా ఎత్తుకోని వైనవైనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు కోటిగాడు. సినిమా కతలు చెప్పమంటే యమాజోరు కోటిగానికి. స్టోరీ అయిపోతూండగానే కుంట వచ్చేసింది. అక్కడ ఎక్కువ వెయిటింగు లేకుండానే దోర్నాల పోయే బస్సు వచ్చేసింది. కిక్కిరిసిపోయి ఉంది. వీళ్ళకి సీట్లు దొరకలా. కండక్టరు మా ఒడుపుగా అందరిమధ్య దూరిపోతూ టిక్కెట్లు కొట్టేసి తన సీట్లో దర్జాగా కూచున్నాడు.

ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.

బాణాసురుడు ఒక విపరీత మనస్తత్వం కలిగినవాడు. ఇతను బలిచక్రవర్తి కుమారుడు. బహుశా యితని చిన్నతనంలోనే తండ్రి పాతాళానికి వెళ్ళిపోయాడేమో! ఇతని చిన్నతనం గురించి అంతగా తెలియదు కాని కొంత పెద్దవాడయ్యాక గొప్ప శివభక్తుడవుతాడు. ఒకనాడు శివుడు కుమారస్వామిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకోడం చూసిన బాణునికి సంతోషమూ విచారమూ ఒకేసారి కలుగుతాయి. తన తండ్రి ఉండుంటే తనని కూడా అలా లాలించేవాడు కదా అనుకొంటాడు.

నీ మీద నేనొక పద్యం
నీ వీపు పలక మీదో
చన్నుల గుండ్రాల మీదో
మొదలుబెట్టి నప్పుడు
నువ్వు తెచ్చిపెట్టుకున్న
బడాయి బింకం
సడలిపోతుంది

ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో, ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి-
మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు
మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?

నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్లి పోతుంది. అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-

ఉద్యోగ పర్వంలో మనోహరమైన కథ లేదు. అసలీ పర్వంలో కథకు ప్రాధాన్యం మిక్కిలి తక్కువ. ఉపాఖ్యానాలను తొలగించి చూస్తే దీనిలోని ప్రధాన కథావస్తువు ద్రుపద పురోహితుని, సంజయుని, కృష్ణుని రాయబారాలే. ఇంతమంది ఒకే విషయాన్ని చెప్పితే అది పునరుక్తి అవుతుంది. అలా పునరుక్తి కాకుండా, ఉత్కంఠ కలిగిస్తూ విషయ వివరణ చేయటం లోనే కవిబ్రహ్మ ప్రతిభ, అనన్య సామాన్యమైన వస్తు సంవిధాన నైపుణ్యం మనకు గోచరిస్తాయి.

గృహమును, దేహమును చక్కగా నలంకరించుకొని, చెలికత్తెలతో నాయకుని గుణగణములను ముచ్చటించుచు, అతని రాకకై ఎదురుచూచునట్టి వాసకసజ్జిక, అతడెంత కాలమునకును రాకపోవుటచే నుత్కంఠాపూరితయై, అతని విరహమును సహింపలేక విరహోత్కంఠిత యగును.

మోహన రాగంలోని తీవ్ర (అంతర) గాంధారానికి బదులుగా కోమల (సాధారణ) గాంధారాన్ని వాడటం వల్ల ఏర్పడే శివరంజని రాగఛ్చాయలో కనిపించే అనూహ్యమైన మార్పు ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే!

పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.