తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్లు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్లు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ల వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్లని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్లల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్లకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్లల్లో ఒక్కళ్లు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.

ఆ రోజు సుజాత ఇద్దరు పిల్లల్ని సూరిగాడికి కాపలాగా పెట్టింది. వాళ్ళు చాలా ఉత్సాహంతో పెద్ద టీచర్ మాటలు పాటించారు. ఒంటేలుకు కూడా ఒంటరిగా వదలకుండా వాడి వెంటే వున్నారు. రెండోరోజుకల్లా సూరిగాడికి చాలా కడుపునొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండిపోయాడు. మూడో రోజు ఉదయం కూడా అలానే ఉందన్నాడు. వాణ్ణి బతిమాలి పడుకోబెట్టి, వాళ్ళ అమ్మ గబాగబా పని ముగించుకునొచ్చేసరికల్లా పత్తా లేడు. నాలుగో రోజు మళ్ళీ రాఘవులు తెచ్చి వదిలాడు. “అమ్మ! జర బద్రం. పోరగాడు మల్ల ఉరికిబోతడు,” అంటూ.

మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా అవకరాలు కావాలని కొని తెచ్చుకోరు కద?”

హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.

అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమెను ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు, అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి.

రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు. నాయుడికి రాయుడంటే చిరాకు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.

సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, గమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”

పురాణాల గురించి వాళ్ళు చేసే వ్యాఖ్యానాలూ ప్రవచనాలూ ప్రసంగాలూ, ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ వంటిదట. ఇది మరొక ఆశ్చర్యమైన పోలిక. అందులోని స్వారస్యం పాఠకులే గ్రహింతురు గాక! అలా పురాణార్థాలను వివరించే సన్యాసులకు సైతం నిజంగా మోక్షం అంటే ఏమిటో తెలియదబ్బాయ్ అన్నాడు. మోక్షాన్ని కౌగిలించుకోవడం అనేది చింతకాయ కజ్జాయం వంటిదట.

తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి — భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది.

మాదొక చిన్న విన్నపము. విద్యాశాఖామాత్యులు మీరు తలచుకుంటే తక్షణం అనుగ్రహింపవలసినది …
 

మంత్రివృషభమ! మాదుగ్రామంబునందు
పాఠశాలను నెలకొల్పు ‘ప్లాను’ గలదు;
దీనికై మీప్రభుత్వంపు దీవెనలను,
‘పర్మిటును’ గోరుటకు నిట వచ్చినాము.

కటిక నేల. చెయ్యి దిండు.
సగం మూసిన కనులు. సగం తెరచిన నోరు.
ఆదమరచిన శరీరం. ఆవులిస్తూ ఆవు.
చెట్టు తొర్రలో కదలని ఉడుత.

అగ్గిపెట్టెల్లోంచి ఎగిరిపోయి
బంతాకులు నెమరేస్తూ
కలల్ని వెదజల్లుతున్న బంగారిపురుగులు
హరివిల్లు లోంచి రంగులను తెచ్చి
పూలతోట కద్దుతున్న సీతాకోకలు

దిగ్గజాల గండస్థలాల మీద తుమ్మెదలు తచ్చాడుతూ తమ రెక్కలకి మదం అంటించుకుంటున్నాయి. వాటితో రెక్కలు బరువెక్కి ఎగరడానికి ప్రయాస పడుతున్నాయి. ఇంతలో రావణుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో నేలకూల్చాడు. ఒక్కసారిగా దేవతలు పువ్వుల్ని పెద్దవానగా కురిపించారు. తుమ్మెదలు ఆ పువ్వుల వెనక పడ్డాయి. భూమి వైపుగా పోతున్న వాటి వెనక ప్రయాణించడం తుమ్మెదలకి సులువుగా ఉంది.

చతుర్మాత్రలతో పాటలు అన్ని భాషలలో నున్నవి. చతుర్మాత్రలతో అష్టమాత్రలను చేర్చి వ్రాసినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన అందము కలుగుతుంది, నడకలో వైవిధ్యము పుట్టుతంది. ఇట్టి అమరికలు ఈ వ్యాసములో వివరించినట్లు ఛందశ్శాస్త్రములో గలవు. కాని వాటిని వెలికి ఇంతవఱకు ఎవ్వరు తీసికొని రాలేదు. ఈ నా ప్రయత్నము గానయోగ్యమైన ఛందస్సులను కల్పించుటకు సహాయకారిగా నుంటుందని భావిస్తాను.

చిన్నయ సూరి బాలవ్యాకరణం పైన ఏ మాత్రం ఆసక్తి వున్న వారికైనా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి పేరు తప్పకుండా తెలిసి వుంటుంది. ఆయన బాలవ్యాకరణానికి రమణీయం అన్న పేరుతో రాసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధం. ఈ సంచికలో ఆ ప్రసంగం వినండి.