నెలరోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్లే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్లు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు.

మనం అక్కడ వున్నన్నాళ్ళు ఇల్లు పెళ్ళివారి ఇల్లులా సందడి సందడిగ, హడావిడిగా వుండేది! మనల్ని చూడ్డానికి మీవైపు వాళ్ళు నావైపు వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే వుండేవారు. వస్తూ వస్తూ ఎంబ్రాయిడరీ చేసిన జేబురుమాళ్ళు, గాజులు, పూసల గొలుసులు, పార్కర్ పెన్నులు, కఫ్ లింక్స్, బందరు లడ్డూలు, కాకినాడ కాజాలు, ఇలా ఏవో ఒకటి మనకోసం ప్రేమగా తెచ్చేవారు.

“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.

ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే!

సాహిత్యంలో పూర్తి మాతృక అన్నది నిజం కాదని గుర్తిస్తే చాలు. నమ్రత ఉన్న ప్రతి కథకుడికీ ఈ విషయం తెలుసు. మంచి రచయిత అయితే, వాడి చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. కథలో రకరకాల అందమైన లోతులు కనిపిస్తాయి. విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి.

ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!

నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.

కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.

తన గురువుగారైన శ్రీపాద కృష్ణమూర్తి గారి గురించి శ్రీ వేదుల సత్యనారాయణ శర్మ పంచుకున్న సంగతుల ఆడియో ప్రసంగం. – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.

ఆధునిక కాలంలో వేమనకు గుర్తింపు రావడానికి కట్టమంచి రామలింగారెడ్డిగారు నిర్వహించిన పాత్ర చాలా పెద్దది. ఇక్కడ మీకు వినిపించుతున్న సి. ఆర్. రెడ్డిగారి రేడియో ప్రసంగం Caste-less society – Vemana అన్న శీర్షికతో అక్టోబర్, 1948లో ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.