శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.

భారత ఉపఖండంలో శబ్ద ఉచ్చారణకున్న ప్రాధాన్యత, ఉచ్చారణ ఆశువుగా నేర్చుకోవడానికి ఏర్పరచిన కఠినమయిన నియమాలు, మరింక ఏ ప్రాంతం లోను కనపడవు. ఈ పరిస్థితి భారత ఉపఖండానికి ప్రత్యేకం. ఈ నేపథ్యం లోంచే బలమైన ధ్వనిశాస్త్రం మనకి అభివృద్ధి చెందింది.

క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం.

మీనాక్షిసుందరం మత పరమైన ఆచారాలనూ సంప్రదాయాలనూ పాటించకపోయినప్పటికీ వాటి సారాన్ని చదివి తెలుసుకున్న వ్యక్తి. ఆయనతో ఆపెన్ హైమర్, హెర్మన్ వైల్ భారతీయ తత్త్వ విషయాలను ఆయనతో చర్చించే వారు. ఆపెన్ హైమర్ అమెరికా ఆటం బాంబ్ ప్రాజెక్టుకు నాయకుడు. మొట్ట మొదటి సారిగా విస్ఫోటనం జరిగినప్పుడు ఆ కాంతిని చూసి భగవద్గీత పదకొండవ అధ్యాయం లోని ‘వేయి సూర్యుల కాంతి’ శ్లోకాన్ని చదివిన వాడు.

పియానో వద్ద కూర్చోటం దగ్గర్నుంచి, ఆ పోశ్చర్‌లో, ఆ చేతులు కదలించటంలో ఎంత గ్రేస్ ఉంది. ఎంత పధ్దతి, ఎంత సైన్స్, ఎంత ఆర్ట్. ఆమెకు పాఠం గంట నిమిషంలాగా గడిచి పోయింది. మొదట్లోనే ఇన్ని నేర్చుకోవాల్సినవి ఉంటే, పోను పోనూ, ఇంకా ఎంత కాంప్లెక్సిటీ పెరుగుతుందో. నా మెదడుకూ నా చేతులకూ కావాల్సినంత పని…

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుంచి ‘అలబేలా సజన్ ఆయో రీ’ అనే గీతం ఆధారంగా. ఈ గీతాన్ని సృజించినది మొగల్ చక్రవర్తి రోషన్ అఖ్తర్ (మొహమ్మద్ షా) ఆస్థానంలో భూపత్‌ఖాన్ అనే విద్వాంసుడని, ఆయన కలం పేరు ‘మనరంగ్’ అనీ చరిత్ర.

పాలగుమ్మి విశ్వనాథం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి.

ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు; రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

లాక్షణికుడైన వామనుడు గద్యమును మూడు విధములుగా విభజించాడు – అవి వృత్తగంధి, చూర్ణము, ఉత్కళిక. పేరుకు తగ్గట్లు వృత్తగంధి అంటే పద్యముల నడకను కలిగి వ్రాయబడినది. అదే విధముగా పొడి పొడి మాటలతో వ్రాయబడినది చూర్ణము. పెద్ద పెద్ద సమాసాలతో ఆడంబరమైన పదాలతో వ్రాయబడినది ఉత్కళిక.

ఇక పద్యంలోని కవిత్వలోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం.

కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.

ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట.

2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.

ఏదో అనబోయి మళ్ళీ జాతకం చూడ్డం మొదలుపెట్టాడు సిద్ధాంతి గారు. సామర్లకోట వచ్చింది. పెద్దాయన కాఫీ ఇప్పించేడు సిద్ధాంతి గారికి. ఎక్కే దిగే జనాల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాప జాతకంలో లీనమై ఉన్నారు. పాప కొంచెం చిరాకుగా ఉన్నట్టు గమనించేడు లూ.

“అమాయకపు జూ. శ్రీరంజనీ, ధర్మసూక్ష్మ మెరుగవు నీవు. యోగా అనగా నేమి? క్రమ పద్ధతిలో గాలి పీల్చుట, వదులుట. టివిలో ఆ యోగా గురువు, కాళ్ళూ, చేతులూ నానా రకాలుగా పెట్టించి, యే ఆసనం వేయించినా, ప్రతీ ఆసనం లోనూ గాలి ఘట్టిగా పీల్చి వదులుడూ, అని చెపుతాడు కదా.”

భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం – నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.

నిర్దిష్టవాక్య నిర్మాణనైపుణ్య నిధి కోసం నిరంతర ప్రయాసను గునపం చేసి తవ్వుతూ పో రచనాకారుడా. చక్కని పదాల కాంతులు అల్లుకున్న చుక్కల పందిరికి లెక్కలేనన్ని భావవిద్యుద్దీపాల వెలుతురు గుత్తులు వేలాడనీ.

కాల స్వభావము! నిన్న మొన్నటిదనుక నిలువ నీడ లేకుండిన ఈ వచన కవులు, క్షురకుడు మార్జాలపు తల గొఱిగినటుల లపనముకొచ్చిన కూతలు గూయుచు, చేతికొచ్చిన వ్రాతలు వ్రాయుచు దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా?