ఎనిమిదేండ్లకు పైగా ఈమాట ముఖ్యసంపాదకుడిగా శ్రమించిన వేలూరి వేంకటేశ్వర రావుగారు ఈ సంచికతో సంపాదకీయ బాధ్యతలనుండి వైదొలిగారు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు. వారు ఇప్పటికీ ఎప్పటికీ ఈమాట కుటుంబ పెద్దలే. వారి మాట మాకు శిరోధార్యమే. – సం.

మోహావేశం రావాలంటే పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది వసంతం కాక మరేమిటి? అందుకనే వసంతుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు మన్మధుడు. వెన్నెల రాత్రుల్లో ఆ పూలూ, పరిమళాలూ లోకాన్ని సౌందర్యంతో ముంచెత్తుతుండగా తను పూల బాణాలు సంధిస్తే — శివుడయ్యేది కాని, మరెవరయ్యేది కాని — ఇక తిరుగేముంది అనుకున్నాడు మన్మధుడు.

ఫోటోలో అమ్మాయ్ నవ్వుతోంది. తీరిగ్గా రామం కాయితం మీద రాసేడు తాను అడగవల్సిన ప్రశ్నలూ అవీ. 1) వంట వచ్చా? ఛ, ఛ. మొదట్లోనే వంట గురించి అడగడం బాగుండదు. కొట్టేసి మళ్ళీ మొదలెట్టేడు. 1) మీ పేరు? ఏడిసినట్టుంది. తనకి పేరు తెల్సీ అడగడం ఏం బావుంటుంది? (కొట్టేసి మళ్ళీ,) 1) మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు?

కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.

తను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, వారానికోసారి శని వారం రోజు ఇంగ్లీషు సినిమా చూడటం అలవాటు అట. మా అన్నయ్య సినిమాకి వెళ్ళనే వెళ్ళడు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో వెళ్ళినా ఏ చిరంజీవి సినిమాకో వెళ్తాడు. అందు వల్ల నేను, మా వదిన కలిసి కొన్ని సార్లు శని వారాలు ఇంగ్లీషు సినిమాకి వెళ్ళడం అలవాటయ్యింది.

నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూవుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!

సూటిదనం మొహం చాటేసి
ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
జల్లెడ లోంచి జారిపోయే నీళ్లు
అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్

నెరవేరని కాంక్షలతో సహజీవనం
కన్నీరుతో చిరునవ్వుతో సహజీవనం
పట్టువిడుపులు తెలియని స్వార్ధపు బిగింపులతో
జనం మెచ్చిన చట్రాలతో సహజీవనం

ప్రతివాది భయంకర శ్రీనివాస్‌ గొప్ప గాయకులు మాత్రమే కాదు, గొప్ప కవి కూడ. వారు 26 అక్షరములకన్న ఎక్కువ అక్షరములు గల వృత్తములను, సార్థక నామ వృత్తములను సృష్టించియున్నారు. వారి స్మృతి చిహ్నముగా వారి పేరుతో పాదమునకు 34 అక్షరములు గల సి-రి-ని-వా-స వృత్తమును కల్పించి వారిపై ఒక పద్యమును వ్రాసినాను.

ఎక్కాలు మొదలు ఎమ్మే దాటి పోయినా
లెక్కల పాఠం ప్రతి దానికీ
పది తలలు
అయినా అది గంట కొట్టంగానే
నీ క్లాస్ రూం లోకి చులాగ్గావచ్చేస్తుంది
ముందు గుమ్మం లోంచి
ముని వేషంలో.

అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని సంస్కృత సాహిత్యం కాని ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు.

పిబిఎస్ నటులకు సరిపోయే గాయకుల గాత్రం అనేదాన్ని గురించి అది ప్రేక్షకుల, శ్రోతల భ్రమ మాత్రమే అంటాడు. రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం, అలాగే తాను సామాన్యంగా ఘంటసాల మత్రమే పాడే ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావులకు పాడితే నప్పదు అనే భ్రమ కూడా అలాంటిదే.

మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.

సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.

వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది.

శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని గుర్తుంచుకోవటానికి ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది విద్యార్థులకు రాగస్వరూపాన్ని సులభంగా నేర్పాలని చేసిన ప్రయత్నం. వెంటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, విశ్వనాథన్, వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.

ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.